నీ బతుకెంత… నువ్వెంత రేవంత్ రెడ్డి ? – ఈటల రాజేందర్‌ ఫైర్

-

నీ బతుకెంత… నువ్వెంత రేవంత్ రెడ్డి ? అంటూ ఈటల రాజేందర్‌ ఫైర్ అయ్యారు. వరంగల్ హరిత హోటల్ లో జరిగిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సమావేశంలో ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ, అమిత్ షా స్వయానా RR టాక్స్ గురించి చెప్పారంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి…కాంగ్రెసోళ్లకు ఎప్పటివరకు ఉంటామో తెలీయదు.. అంతా సర్దుకొని పెట్టారన్నారు.

Etala Rajendhar fire on cm revanth reddy

హైదరాబాదులో బిల్డింగ్ పర్మిషన్ కు SFT కి 75,000 వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేరని ఆగ్రహించారు. అతి తక్కువ కాలంలో.. అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసిన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచిందని ఫైర్‌ అయ్యారు. అతితక్కువ కాలంలో ప్రజలచే చీ కొట్టుకున్న ఏకైక సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచిపోయారు…మళ్ళీ పంటలు ఎండిపోయాయి.. మోటార్లు కాలిపోయాయని ఆగ్రహించారు ఈటల. మళ్ళీ ఇవ్వాళ మామూళ్ల వ్యవస్థలు వచ్చాయి…ఆఫ్ట్రాల్ నీ బతుకెంత… నువ్వెంత రేవంత్ రెడ్డి….ప్రజలు ఆశీర్వదించి.. బిక్షపెడితే నీకో పదవి వచ్చిందని మండిపడ్డారు ఈటల రాజేందర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version