మనవడి కోసం తిరుమలకు సీఎం రేవంత్ కుటుంబం

-

BREAKING: ఇవాళ తిరుమలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం బషీర్ బాగ్ లోని పరిశ్రమల భవన్ కు సిఎం రేవంత్ రెడ్డి వెళతారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం దాదాపు 3 గంటలకు జరుగనుంది. ఇక అనంతరం ఏపీకి వెళతారు సీఎం రేవంత్‌.

CM revanth reddy family to Tirumala to offer grandchild head blue

ఇవాళ రాత్రి లేదా సాయంత్రం తిరుపతి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఛాన్స్‌ ఉంది. అయితే.. తిరుమలకు కుటుంబ సమేతంగా సీఎం రేవంత్‌ వెళ్లనున్నారు. మనవడి తల నీలాలు సమర్పించేందుకు తిరుమలకు సీఎం కుటుంబం వెళుతోంది. ఇవాళ్టి నుంచే తిరుమలలో వీఐపీ దర్శనాలు ప్రారంభం అయ్యాయి. దీంతో నేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు సీఎం రేవంత్‌. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version