Etala rajendhar Sensational Comments On cm revanth reddy: 2 ఏళ్లలోనే రేవంత్ ప్రభుత్వం కూలుతుందని అంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రేవంత్ ప్రభుత్వం పై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఉంటే గింటె మరో రెండు ఏళ్ళు ఉంటుందంటూ బాంబ్ పేల్చారు. రేవంత్ రెడ్డి మాటలన్నీ బ్రోకర్, అబద్ధపు మాటలు అంటూ ఆగ్రహించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.

రజాకార్ల వారసుడిలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. సామాన్యులకు సమయం వచ్చినప్పుడు ఎదురు తిరుగుతారని హెచ్చరించారు. ఈ సర్కారు ను త్వరలోనే బొంద పెడతారని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.