రేవంత్ రెడ్డికు ఈటల కౌంటర్‌…నీ అయ్య సొత్తు కాదు..!

-

రేవంత్ రెడ్డికు ఈటల కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ నీ అయ్య సొత్తు కాదన్నారు. ఇందిరా పార్క్ దగ్గర త్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి హాజరై మద్దతు తెలిపిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్…అనంతరం మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఎవరిని కదిలించిన ఏదో ఒక దుఃఖంలో ఉన్నారు…ఎవరు కూడా క్షేమంగా ఉన్నామని చెప్పడం లేదన్నారు. ఈ ధర్నాకు రైతులు కుటుంబాలతో సహా వచ్చారని… మీకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని ప్రకటించారు.

cm revanth vs etala

రేవంత్ రెడ్డి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు చేస్తున్నారని… కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం లేనప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు మరొకలాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అంటే మీ అయ్య సొత్తు కాదు….. రోడ్లకు, ప్రాజెక్ట్ లకు భూములు ఇవ్వడానికి వ్యతిరేకం కాదని వెల్లడించారు ఈటల రాజేందర్. కానీ అక్కడ ఉన్న రేటు ఇచ్చి తీసుకోవాలని కోరుతున్నారన్నారు. స్థానిక రైతులు అభిప్రాయం తెలుసుకోకుండా, వారి గోడు వినకుండా భూములు గుంజుకుంటే ఎలా ? అని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు రాబందుల్లా వ్యవహరిస్తే…. అందరూ పోయేది ఒకే మట్టిలోకి.. ఏడిపించి సంపాదించి ఏం చేసుకుంటారు అని అడుగుతున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news