తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్‌ది ప్రత్యేక స్థానం. స్వరాష్ట్రం కోసం మలివిడిత ఉద్యమంలో ముఖ్యుడు ఈటల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నాలుగేళ్ల పాటు ఆర్ధిక మంత్రిగా.. అలాగే రెండేళ్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా తెలంగాణ ప్రజలకు తన సేవలు అందించారు ఈటెల రాజేందర్. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉండి నడిపించిన ఈటలను కేసీఆర్ మంత్రివర్గం పార్టీ నుంచి బర్తరఫ్ చేశారు. తాను పదవి కోసం కాదు ప్రజలకు సేవ చేయడానికే రాజాకీయాల్లోకి వచ్చాను అన్ని నమ్మిన ఈటలను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు ఈటెల రాజేందర్. ఆ తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి రాజీనామా చేసి తాను ప్రజా నాయకుడు అని నిరూపించుకొని ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో మళ్లీ గెలిచారు.
ఈటల రాజేందర్ ఒక కులానికో, ప్రాంతానికో, మతానికి సంబంధించిన వ్యక్తి కాదు.. ప్రజా నాయకుడిగా, రాజకీయ దురందురుడిగా, సీనియర్ నాయకుడిగా తెలంగాణ రాజకీయాల్లో తన మార్క్‌ను సృష్టించాడు ఈటల. 22 సంవత్సరాల కాలంలో తెలంగాణ మట్టిబిడ్డగా, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. అదే పట్టుదలతో తెలంగాణ ప్రజలు తమపై చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకొని.. తనపై వచ్చిన ఆరోపణలు అన్ని అసత్య ప్రచారాలను అని నిరూపించుకున్నాడు ఈటల. ఏ కులానికీ, మతానికి సంబంధం లేకుండా సహాయం కోరి వచ్చిన వారికీ లేదు అని చెప్పకుండా సహాయం చేయడమే ఈటల రాజేందర్ నైజం. ఆవిర్భావం నుంచి ఎంతో కృషి చేసి పార్టీలో ముఖ్యుడుగా పేరు తెచ్చుకున్న అతనిని అసత్య ప్రచారాలతో పార్టీ నుంచి బర్త్‌రఫ్ చేసిన.. తన నిజాయితీని నమ్ముకొని ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెల్చిన వ్యక్తి ఈటల రాజేందర్.
తెలంగాణ రాష్ట్రంలో తొలి ఆర్థికమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించిన ఈటల తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు చూసారు. తనపైన ఎన్ని దూషణలు, ఆరోపణులు చేసిన మొత్తం రాజకీయ జీవితంలో ఏ నాయకుడి మీదగానీ, ఏ పార్టీ మీదగానీ వ్యక్తిగతమైన దూషణలు చేయలేదు. బీసీలకు మాత్రమే కాదు.. ఏ వర్గానికి చెందిన వారికైన, నేను ఉన్న అని చేయి అందించే వ్యక్తి ఈటల రాజేందర్.