ప్రాణం పోయినా ధరణిని తీసే పరిస్థితి లేదు : సీఎం కేసీఆర్

-

జనగామలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అంతకు ముందు కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని.. మంచి, చెడు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. రైతుల బాధలు ఏంటో నాకు తెలుసు. నేను ఓ కాపునే.. రైతు బిడ్నే.. రైతుల భూములను టచ్ చేసే అధికారం ఎవ్వరికీ లేదు. కాంగ్రెస్ నేతలు ధరణినీ బంగాళఖాతంలో వేస్తామంటున్నారు. ధరణిని కాదు.. కాంగ్రెస్ ను బంగాళఖాతంలో వేయాలన్నారు కేసీఆర్. ప్రాణం పోయినా ధరణిని తీసే పరిస్థితి లేదు అన్నారు. 

కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే.. మళ్లీ వీఆర్వోలు వస్తారు. మరోవైపు  పాస్ బుక్ లో కౌలు రైతులను చేర్చాలంటున్నారు కాంగ్రెస్ నాయకులు.  కేసీఆర్ బతికి ఉన్నంత వరకు దళితబంధు కార్యక్రమం కొనసాగుతుంది. బీసీలకు వచ్చే లక్ష రూపాయలు కూడా అందరికీ అందుతాయని హామి ఇచ్చారు కేసీఆర్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version