కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి షబ్బీర్ అలీ వెనకడుగు..?

-

తెలంగాణలో రాజకీయాలు మారిపోయాయి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి చేరుతున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయనున్నారు. కేసీఆర్ మాదిరిగా ఈటల రాజేందర్ కూడా కేసీఆర్ పై గజ్వేల్ లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తుండటంతో.. కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగే షబ్బీర్ అలీ తప్పుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

కామారెడ్డి బరిలో సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ పోటీ చేస్తారా? వేరే అభ్యర్థిని బరిలోకి దించుతారాా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది.  ఇప్పటికే సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని బహిరంగంగా కూడా ప్రకటించిన అంశం కొలిక్కి రానట్లే కనిపిస్తోంది. కేసీఆర్ పై పోటీకి షబ్బీర్ అలీ జంకుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం కాంగ్రెస్ ఫవర్‌పుల్ అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తోందని సమాచారం. షబ్బీర్ అలీ ఎల్లారెడ్డి నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎల్లారెడ్డి కాంగ్రెస్  అభ్యర్థి మదన్ మోహన్ రావు కామారెడ్డికి వెళ్లాలని కోరుతున్నట్లుగా కాంగ్రెస్ చూపుతోంది. అయితే ఫలితాలు వస్తే తన పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఆశించారట. దీంతో ఆయన కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని చూస్తున్న మదన్ మోహన్ రావు కామారెడ్డి నుంచి బరిలో దిగాలని కాంగ్రెస్‌ హైకమాండ్ కోరుకోగా.. షబ్బీర్ అలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version