అన్ని వనరులు ఉన్నా దేశం వంచింపబడుతుంది – సీఎం కేసీఆర్

-

సీఎం కేసీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ (రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) మెడికల్ కాలేజీ హాస్పిటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కెసిఆర్ ఉద్యమం ప్రారంభించిన సమయంలో పుట్టిన వాళ్లు ఇప్పుడు వైద్య విద్యార్థులుగా ఉన్నారని అన్నారు.

తెలంగాణ ప్రస్తుతం అన్ని రంగాలలో ముందుందని అన్నారు. కేంద్ర మంత్రులు ఇక్కడ తిట్టిపోతారు.. ఢిల్లీకి వెళ్లి అక్కడ అవార్డులు ప్రకటిస్తారని ఎద్దేవా చేశారు. రాజకీయం కోసం చేసే విమర్శలను పట్టించుకోవద్దని అన్నారు సీఎం కేసీఆర్. అన్ని రంగాలలో లానే.. వైద్య రంగాన్ని కూడా అభివృద్ధి చేశామన్నారు. కేంద్రం సహకరించకపోయినా 33 జిల్లాలలో మెడికల్ కాలేజీలు తెచ్చుకోవచ్చు అన్నారు.

ఉన్న రాష్ట్రాన్ని పోగొట్టుకుంటే ఎంత నష్టపోవాల్సి వచ్చిందో అందరికీ తెలిసిందేనన్నారు సీఎం. మన అస్తిత్వం కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. నేడు ప్రపంచానికి భారతదేశం అన్నపూర్ణ లాగా ఉందన్నారు. మెడికల్ విద్యతో పాటు సామాజిక విద్య పైన కూడా దృష్టి ఉంచుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version