విగ్రహం మార్పు మూర్ఖత్వం.. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా..? : కేసీఆర్

-

అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి అని బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ సూచించారు. నాడు రైతుబంధు తీసుకొచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులను అందరికీ వివరించాలి. నాడు తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తి గురించి చెప్పాలి. విగ్రహం మార్పు మూర్ఖత్వం, ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా.. సమస్యలు, పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కానీ.. మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు.

ఫార్మాసిటీ ఎందుకు ప్రతిపాదించింది.. పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను వివరించాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. నిర్భంద పాలన గురించి సమావేశాల్లో ప్రస్తావించాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్ విషయమై నిలదీయాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపాలి. ఫిబ్రవరిలో పార్టీ పరంగా బహిరంగ సభ నిర్వహించి సర్కార్ వైఖరి ఎండగడతాం. ఫిబ్రవరి తర్వాత పార్టీ అన్ని కమిటీలు ఏర్పాటు, ఆ తర్వాత సభ్యత్వ నమోదు ఉంటుంది అని కేసీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news