నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదాలపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

-

నల్గొండ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల ఘటనలపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

నల్గొండ జిల్లాలో ఆదివారం రాత్రి సమయంలో ఓ బైకర్ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇందులో బైకర్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు టాటా ఏస్ వాహనంలో హడావుడిగా ఘటనాస్థలికి బయల్దేరారు. ఈ క్రమంలో ప్రమాదస్థలికి అరకిలోమీటరు దూరంలో ఉండగా వారి వాహనాన్ని అయిల్ ట్యాంక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఆ జిల్లాలో తీవ్ర విషాదం నింపింది.

Read more RELATED
Recommended to you

Latest news