తమిళనాడులో ఖాతా తెరవాలని ఆశలు పెట్టుకున్న బీజేపీకి మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. ఆ రాష్ట్రంలో పోటీ చేసిన కీలకమైన బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఓటమి దిశగా పయణిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరులో ఓటమి అంచునా నిలిచారు. కోయంబత్తూరులో అధికార డీఎంకే అభ్యర్థి దాదాపు 25 వేల ఓట్లకు పైగా మెజార్టీతో దూసుకుపోవడంతో అన్నామలై ఓటమి ఖరారైంది. ఇదిలా ఉంటే బీజేపీ మరో బీజేపీ కీలక నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై కూడా ఓటమి అంచునా నిలిచారు. చెన్నె సౌత్ పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ తరుపున బరిలోకి దిగిన తమిళి పై డీఎంకే అభ్యర్థి దాదాపు 40 వేలకు పైగా ఓట్ల లీడ్లో కొనసాగుతున్నారు. దీంతో తమిళి సై ఓటమి ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే ఆమె కౌంటింగ్ కేంద్రం నుండి వెళిపోయారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ గవర్నర్ పదవిరి రాజీనామా చేసిన తమిళి సై.. ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీ నుండి లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. సౌత్లో ఎలాగైనా పాగా వేయాలని కంకణం కుట్టుకున్న బీజేపీ.. తమిళి సై సొంత రాష్ట్రమైన తమిళనాడులో చెన్నె సౌత్ పార్లమెంట్ స్థానం నుండి ఆమె పోటీ చేశారు. కీలక నేతలను బరిలోకి దించి తమిళనాడులో ఖాతా తెరవాలని చూసిన బీజేపీకి భారీ తగిలింది. గెలుస్తారనే నమ్మకం ఉన్న అన్నామలై, తమిళి సై ఇద్దరు ఓటమి అంచునా నిలవడంతో మిగిలి బీజేపీ ఆశలు కలలుగానే మిగిలిపోయాయి.