జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి మంత్రి హరీశ్‌రావు వెళ్లారు. విష్ణువర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో విష్ణువర్ధన్ రెడ్డి పనిచేశారని హరీశ్ రావు గుర్తు చేశారు. విష్ణు వర్ధన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు సుముఖంగా ఉన్నారని తెలిపారు. అనంతరం హరీశ్ రావు, విష్ణు వర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మా పార్టీలో చేరాలని విష్ణువర్ధన్ రెడ్డిని కోరాం. జనార్దన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీ అవమానించిందని విష్ణు బాధపడ్డారు. మేము విష్ణు అందరం 5 ఏళ్లు కలిసి శాసన సభ సభ్యులుగా పని చేశాం. అనేక ఉద్యమాల్లో విష్ణు మాతో కలిసి పోరాడారు. మా పార్టీలో చేరేందుకు విష్ణు సుముఖత వ్యక్తం చేశారు. పట్టపగలు డబ్బు కట్టలతో దొరకిన వ్యక్తి రేవంత్ రెడ్డి. సీట్లు అమ్ముకున్న వ్యక్తి రేవంత్. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుంది అనేది ప్రజలు గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుంది. అని హరీశ్ రావు అన్నారు.
మరోవైపు విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తమ తండ్రి కాంగ్రెస్ అంటే ఎంతో మక్కువతో ఉండేవారు. అది తమ రక్తంలోనే ఉందని భావించే వారు. మేమూ ఆయన బాటలోనే నడిచాం. నడవాలనుకున్నాం. కానీ ఈరోజుల్లో ఆ పార్టీ పరిస్థితులు మారాయి. ఇలాంటి ఓ రోజు వస్తుందని కళ్లో కూడా ఊహించలేదు. పార్టీకి ఎంతో సేవ చేసిన నాకు టికెట్ ఇవ్వలేదు. త్వరలో గాంధీ భవన్ అమ్ముడుపోతుంది. అందుకే బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు.