హైదరాబాద్‌ లోని 5 పబ్బుల్లో ఎక్సైజ్ సోదాలు…37 మందికి డ్రగ్స్‌ టెస్టులు !

-

Excise searches in 5 pubs in Hyderabad: హైదరాబాద్‌ లోని 5 పబ్బుల్లో ఎక్సైజ్ సోదాలు నిర్వహించారు అధికారులు. హైదరాబాద్‌ నగరంలోని ఐదు పబ్బుల్లో 37 మందికి డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేశారు. నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని అధికారులు ప్రకటించారు. ఐదు పబ్బుల్లో నిర్వహించిన తనిఖీల్లో నలుగురు డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగింది.

Excise searches in 5 pubs in Hyderabad

శేరి లింగంపల్లి నాలెడ్జ్ సిటీలోని m/s quorum club లో పబ్ లో ఇద్దరికీ పాజిటివ్ వచ్చిందని అధికారులు ప్రకటించారు. జూబ్లీహిల్స్ లోని m/s బేబీలోన్ లో ఇద్దరికీ డ్రగ్ పాజిటివ్ వచ్చిందని అధికారులు ప్రకటించారు. పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్ కు చెందిన చిన్న నిగేష్, శ్రీకాకుళం కి చెందిన నార్త్ రవికుమార్, మూసాపేటకు చెందిన టీవీఎస్ కేశవరావు, చార్మినార్ కు చెందిన అబ్దుల్ రహీమ్ లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని అధికారులు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news