తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది.
రూ. 2,500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరంలో కొన్ని కోర్సుల్లో కలిపి 10 లక్షల 59 వేల 233 మంది విద్యార్థులు ఉంటే.. పరీక్ష ఫీజు చెల్లింపు గడవు ముగిసే సరికి 9 లక్షల 77 వేల 44 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు.
ఈ క్రమంలో మరోసారి ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది ఇంటర్ బోర్డు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2024 మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష టైమ్ టేబుల్ ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫిబ్రవరి 28, 2024 నుండి ప్రారంభం కానుండగా.. రెండవ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29, 2024 నుండి ప్రారంభం అవుతాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.