హైదరాబాద్ లో 5. 41 లక్షల నకిలీ ఓట్ల తొలగింపు

-

హైదరాబాద్ మహా నగరంలో ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రక్షాళన చేసింది. మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఓటరు జాబితాను అధికారులు సవరించారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో లక్షా 81 వేల 405 మంది ఓటర్ల వివరాలను సవరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రాస్‌ తెలిపారు. 5 లక్షల 41 వేల 201 ఓట్లను తొలగించినట్లు చెప్పారు.

‘2023 జనవరి నుంచి 2024 మార్చి నెలాఖరు వరకు ఓటరు జాబితాను విశ్లేషించి, చనిపోయిన వ్యక్తులు, డూప్లికేట్స్, చిరునామా మార్పునకు సంబంధించిన ఓట్లను తొలగించాం. అందులో చనిపోయిన వ్యక్తులు 47 వేల 141 ఓట్లు, చిరునామా మార్పులో 4 లక్షల 39 వేల 801 ఓట్లు, డూప్లికేట్‌లో 54 వేల 259 ఓట్లు తొలగించాం.  వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి, వారిని ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చి ఓటు వేసేలా 3 లక్ష 78 వేల 713 మంది ఓట్లను సవరించాం.  ఓటరు జాబితాలో ఇంటి నెంబర్ల అవకతవకలను గుర్తించి జిల్లాలోని 1 లక్ష 81 వేల 405 ఓటర్ల వివరాలను సరిదిద్దాం. వీటిలో అత్యధికంగా సికింద్రాబాద్‌లో 31 వేల 42, కంటోన్మెంట్‌లో 22 వేల 732, యాకత్‌పురాలో 19 వేల 909, ముషీరాబాద్‌లో 19 వేల 700, జూబ్లీహిల్స్‌లో 14 వేల 429 ఓట్లను సరిచేసినట్లు’ రోనాల్డ్ రాస్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news