నేటి నుంచి తెలంగాణలో రైతు రుణ మాఫీ ప్రక్రియ ప్రారంభం

-

తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుడ్ న్యూస్ చెప్పారు. రైతు బాందవుడైన కేసిఆర్ మరోసారి తాను రైతు పక్షపాతి అని నిరూపించారు. ఇంతకీ సీఎం ఎం చేశారంటే..? ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ ప్రక్రియను పునఃప్రారంభించాలని అధికారులను ఆదేశించారు కేసిఆర్.

రైతు రుణమాఫీపై ప్రగతి భవన్‌లో బుధవారం రోజున సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతుబంధు తరహాలో విడతలవారీగా రుణమాఫీ : 2018 ఎన్నికల సందర్భంగా రూ.లక్ష లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, కొంతమేర రుణాలు మాఫీ చేశామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా రుణమాఫీ చేయాలని, సెప్టెంబర్‌ రెండో వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. మరో రూ.19వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు.

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావుతో పాటు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news