కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర కార్యాలయంలో బర్రెలను కట్టేసిన రైతు

-

భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కు ఊహించని షాక్ తగిలింది. ఆయన క్యాంప్ కార్యాలయంలో బర్రెలను కట్టేసి నిరసన తెలిపారు పాడి రైతు దంపతులు. ఎమ్మెల్యే చెప్పినందుకే తమ బర్ల షెడ్డు అన్యాయంగా కూల్చివేశారు అని బర్లను తీసుకువెళ్లి నిరసన తెలిపారు రైతులు.

Farmer ties up goats at Congress MLA Gandra's office
Farmer ties up goats at Congress MLA Gandra’s office

జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం వేశాలపల్లి గ్రామంలోని తమ బర్ల షెడ్డును అధికారులు కూల్ చేశారని ఎమ్మెల్యే కార్యాలయానికి బర్లతో వచ్చి నిరసన తెలిపారు రైతు దంపతులు ఓదెలు అలాగే లలిత. ఎమ్మెల్యే చెబితేనే కూల్చి వేశారని పోలీసులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక్క రూపాయి తీసుకోకుండా అతనికి ఓటు వేసినందుకు ఆయన మాకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ నిలదీసిన రైతు దంపతులు… షెడ్డు నిర్మించే వరకు బర్లను తీసుకెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news