తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. అది కూడా వరుసగా స్కూళ్లకు మూడు రోజులపాటు హాలిడే రాబోతోంది. ఈనెల 8వ తేదీ అంటే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాధారణ సెలవు ఉండబోతోంది.

ఇక తొమ్మిదో తేదీన శనివారం ఆ రోజున రాఖీ పౌర్ణమి ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో… రెండు తెలుగు ప్రభుత్వాలు ఆప్షనల్ హాలిడే ఇవ్వనున్నాయి. ఇక పదవ తేదీన అంటే ఆదివారం రోజున హాలిడే కావడంతో వరుసగా మూడు రోజులు పాఠశాలలకు హాలిడే రాబోతోంది. ఇలా వరుసగా మూడు రోజులు హాలిడేస్ రావడంతో… విద్యార్థులు సంబరపడిపోతున్నారు.