పండక్కి ఊరెళ్తున్నారా.. ట్రాఫిక్ లో చిక్కుకోవద్దంటే ఫాస్టాగ్‌ సరి చూసుకోండి

-

సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నగరమంతా సొంతూళ్లకు పయనమవుతుంది. ఇప్పటికే చాలా మంది బస్సు, రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే సొంత వాహనాల్లో తమ ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం తప్పవు. అయితే ఈ ట్రాఫిక్ నుంచి కాస్త ఉపశమనం పొందాలంటే వాహనదారులు ఒకసారి తమ వాహనం ఫాస్టాగ్‌ను సరిచూసుకోకుంటే ఇబ్బంది పడే ప్రమాదముంది.

ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఫాస్టాగ్‌ను కేవైసీ చేయించకపోయినా, ఆ ఎకౌంట్‌లో సరిపడా నగదు లేకపోయినా మీరు బ్లాక్‌లిస్టులో పడిపోవడం ఖాయం. ఫాస్టాగ్‌ ఉంటే అర నిమిషంలోపే టోల్‌ ప్లాజాను దాటొచ్చు. ఈ పండుగకు మీరు టోల్ ప్లాజ్ వద్ద ట్రాఫిక్ జామ్ లో చిక్కుకోకుండా ఉండాలంటే వెంటనే మీ వాహనానికి ఫాస్టాగ్ చేయించుకోవాలని టోల్ ప్లాజా నిర్వాహకులు చెబుతున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి మొత్తం 273 కి.మీ. ఉండగా.. తెలంగాణలో పంతంగి, కొర్లపహాడ్‌, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా మీదుగా గత ఏడాది సంక్రాంతికి రోజుకు 60 వేల వాహనాలు వెళ్తాయి. ఈసారి 65-70 వేల వరకు రాకపోకలు సాగిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉండనున్న నేపథ్యంలో ఫాస్టాగ్ ఉంటే రద్దీ నుంచి ఉపశమనం పొందవచ్చని టోల్ ప్లాజా నిర్వాహకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news