తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..త్వరలో 6వేల పోస్టుల భర్తీ?

-

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ఆరోగ్యశాఖలో 6 వేల పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ఈనెల 8వ తేదీలోగా ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.

Filling of 6 thousand posts soon

6 వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీటిలో సుమారు 3 వేల డాక్టర్ పోస్టులు, మిగతావి పారామెడికల్, అడ్మినిస్ట్రేషన్ సంబంధిత పోస్టులు ఉంటాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఇక అటు  జూన్‌లో విధుల్లోకి విద్యా వలంటీర్లు రానున్నారని సమాచారం. జూన్ 11 నాటికి విద్యా వలంటీర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

వచ్చే విద్యా సంవత్సరంలో తొలిరోజు నుంచే విద్యా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకానికి 6-9 నెలల టైం పట్టే అవకాశం ఉండడంతో వాలంటీర్లతో పాఠాలు చెప్పించనుంది. గతంలో 12,600 మంది విద్యా వలంటీర్లుగా పనిచేయగా, ఈసారి స్కూళ్లలో ఉన్న ఖాళీల ప్రకారం ఎంపిక చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version