నీలోఫర్ ఆసుపత్రి లో అగ్ని ప్రమాదం

-

హైదరాబాద్ నగరంలోని   మరో ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది.  ఉన్నట్టుండి నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించినట్లు సమాచారం. మంటలు ఇతర అంతస్తులకు వ్యాపిస్తుండటంతో బిల్డింగ్ లో చిక్కుకున్న డాక్టర్లు, పేషెంట్లు, వారి బంధువులు భయాందోళనకు గురవుతున్నారు.

 

వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోి తెచ్చేందుకు ప్రయత్నించారు. హాస్పిటల్ మొదటి అంతస్తులోని బయోకెమిస్ట్రీ ల్యాబ్ లో మంటలు చెలరేగాయి.  ఈ ఆసుపత్రిలోని బయోకెమిస్ట్రీ ల్యాబ్ ని సాయంత్రం 4.30గంటలకు బంద్ చేసి సిబ్బంది వెళ్లారు. సిబ్బంది వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ల్యాబ్ లో మంటలు చెలరేగాయి. అసలు ఆ మంటలు చెలరేగడానికి కారణం ఏంటి..? అనేది మాత్రం తెలియలేదు. ఆసుపత్రి పై అంతస్తుల్లో పొగ రావడంతో చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళన చెందారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని పై అంతస్తుకు మంటలు వ్యాపించకుండా అరికట్టారు. అయినప్పటికీ కొద్దిగా పొగ రావడంతో పేషెంట్లకు పక్క వార్డుల్లోకి షిప్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version