కేసీఆర్‌ సర్కార్‌ మరో శుభవార్త..బీసీ గురుకులాల్లో చేపల కూర

-

తెలంగాణ రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు కేసీఆర్‌ సర్కార్‌ మరో శుభవార్త చెప్పింది. బీసీ గురుకులాల్లో చేపల కూర పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది కేసీఆర్‌ సర్కార్‌. దసరా తర్వాత బీసీ గురుకులాల్లోని విద్యార్థులకు భోజనంలో చేపల కూర అందించాలని ఫిష్ ఫెడరేషన్ నిర్ణయించింది.

Fish curry in BC Gurukul
Fish curry in BC Gurukul

ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు ఫెడరేషన్ చైర్మన్ రవీందర్ తెలిపారు. ఒక్కో విద్యార్థికి 150 గ్రాములు చొప్పున ప్రతి బుధవారం 15వేల మందికి చేపల కూర అందిస్తామన్నారు. ఈ మేరకు స్కూళ్లలోని వంట మనుషులకు ఒక రోజు శిక్షణ ఇవ్వనున్నారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవు తేదీని మార్చుతూ నిర్ణయం తీసుకుంది. దసరా పండుగను పురస్కరించుకుని.. అక్టోబర్ 23, 24 తేదీలను తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ రెండు రోజులు ప్రభుత్వ ఆఫీసులకు కూడా సెలవు ఉంటుందని జీవో జారీ చేసింది సీఎం కేసీఆర్ సర్కార్. 25వ తేదీ ఆప్షన్ హాలిడే ఇచ్చింది.వాస్తవానికి దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ విద్వత్‌ సభ అక్టోబర్ 23న దసరా పండుగను నిర్వహించుకోవాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news