తిరుమల శ్రీ వారి భక్తులకు శుభవార్త అందింది. క్యూ లైన్ లో వేచివుండే అవసరం లేకూండా శ్రీ వారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. నిన్న భక్తుల రద్దీ కాస్త తగ్గింది. దీంతో తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు భక్తులు. ఇక నిన్న ఒక్కరోజే 72309 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
నిన్న ఒక్క రోజే 26, 296 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు నిన్న ఒక్క రోజే … తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 4.5 కోట్లు గా నమోదు అయింది. ఇది ఇలా ఉండగా, తిరుపతిలో ఇవాళ్టి నుంచే దర్శనం టోకెన్లు బంద్ చేయనుంది టీటీడీ పాలక మండలి. తిరుమల లో భక్తుల రద్ది దృష్యా ఇవాళ, 13,14,15వ తేదిలలో తిరుపతిలో జారి చేసే సర్వదర్శన టోకేన్లు రద్దు చేసింది టిటిడి. ఇక అటు తిరుమలలో 14వ తేదిన నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.