గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కు 5 ఏళ్లు పూర్తి

-

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కు 5 ఏళ్లు పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా కరీంనగర్ లోని మన మానేరుడ్యాం సమీపంలో రాశి వనములో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మొక్కలను నాటారు. ఆయనతో పాటు మంత్రి గంగుల కమలాకర్ కుప్పుల ఈశ్వర్ మేయర్ సునీల్ రావు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ మూడు మొక్కలతో మొదలైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఇప్పుడు లక్షల మొక్కలతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు. ఆరో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో నేను పాల్గొని భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news