వైద్యశాస్త్ర చరిత్రలో ఓ మిరాకిల్ జరిగింది. తెగిన తలను అతికింగి ఇజ్రాయెల్ డాక్టర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మృత్యు ఒడికి చేరువలో ఉన్న ఓ బాలుడికి.. ఆధునిక సాంకేతికత, తమ నైపుణ్యాన్ని మేళవించి పునర్జన్మ ప్రసాదించారు.
జోర్డాన్ వ్యాలీకి చెందిన 12 ఏళ్ల సులేమాన్ హసన్‌కు సైకిల్ రైడ్ ఎంతో ఇష్టం. ఓ రోజు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన హసన్‌ను ప్రమాదవశాత్తు ఓ కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన బాలుడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ప్రమాదంలో హసన్ మెడ భాగంలో, పొత్తి కడుపులో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. తల, శరీరం దాదాపు ఒకదాన్నుంచి మరోటి వేరైన స్థితిలో హసన్‌ను ఆస్పత్రికి తీసుకువచ్చారు. తలతో వెన్నెముక చివరి అంచును కలిపి ఉంచే భాగం దాదాపు విడిపోయింది. జెరూసలేంలోని హదస్సా ఈన్ కెరెమ్ ఆస్పత్రి వైద్యులు ఈ కేసును ఓ సవాలుగా స్వీకరించారు. అనంతరం ఆపరేషన్ చేసి బాలుడి ప్రాణాలు నిలబెట్టారు.