ఇప్పటికే చాలామంది హీరోలు జపాన్ లో తమ సినిమాలను విడుదల చేసి భారీ మార్కెట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ తోనే అదరగొట్టి సత్తా చాటారు. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నాన్ బాహుబలి కేటగిరీలో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక 2018లో విడుదలైన ఈ సినిమా రూ .216 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించగా.. రాంచరణ్ లోని కంప్లీట్ యాక్టర్ ని ఈ సినిమా అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా పరిచయం చేసింది.
ఇక ఇప్పుడు జపాన్ లో రిలీజ్ కాగా మగధీర సినిమాతోనే మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు రంగస్థలం సినిమాతో మరో ఫీట్ అందుకున్నారు. నిన్న అనగా జూలై 14 వ తేదీన జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాతో పాటు ఇండియన్ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ 1, కేజిఎఫ్ 2 చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే కేజీఎఫ్ చిత్రాలకు మించి రంగస్థలం సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టడం గమనార్హం. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 2.5 మిలియన్ యాన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది ఈ సినిమా.
ఇక మొదటి రోజు మొత్తం కలెక్షన్లు కలుపుకొని బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2023 కి గాను జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్న ఇండియన్ మూవీ గా నిన్నటి వరకు బ్రహ్మాస్త్ర మూవీ నిలవగా.. ఇప్పుడు ఆ ప్లేస్ ని రంగస్థలం సినిమా ఆక్రమించింది. ముఖ్యంగా అక్కడ మంచి టాక్ అందుకుంటే.. ఇప్పటికే గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్న రాంచరణ్.. ఇక జపాన్ లో కూడా తన మార్క్ ను అలాగే కొనసాగిస్తారు అనడంలో సందేహం లేదు.