తెలంగాణలో విద్యాసంస్థలలో ఫుడ్ పాయిజన్ సంఘటన వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ మండలం నాగనూలు కస్తూర్బా విద్యాలయంలో ముగ్గురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థినిలు… ఆస్పత్రి పాలయ్యారు.
ప్రేమలత , అక్షయతో పాటు మరో విద్యార్థికి వాంతులు, విరోచనాలు, దగ్గు రావడంతో నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బయటి ఫుడ్డు తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందంటున్నారట కస్తూర్బా సిబ్బంది. ఒకరు మాత్రమే బయటి ఫుడ్ తిన్నారని మిగతా ఇద్దరికి ఎలా అయిందని కస్తూర్బా సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఇప్పుడు నాగర్ కర్నూల్ జిల్లా కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులకు జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటన హాట్ టాపిక్ అయింది.
నాగర్ కర్నూల్ జిల్లా కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్
నాగర్ కర్నూల్ మండలం నాగనూలు కస్తూర్బా విద్యాలయంలో ముగ్గురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థినిలు
ప్రేమలత , అక్షయతో పాటు మరో విద్యార్థికి వాంతులు, విరోచనాలు, దగ్గు రావడంతో… pic.twitter.com/RIoWteceQx
— Telugu Scribe (@TeluguScribe) December 9, 2024