యాదాద్రి, వర్గల్ ఆలయాలకు ఫుడ్ సేఫ్టీ జాతీయ గుర్తింపు

-

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి జాతీయ గుర్తింపు లభించింది. కేంద్రానికి చెందిన ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి భోగ్ (బ్లెస్ ఫుల్ హైజినిక్ ఆఫరింగ్ టు గాడ్) సర్టిఫికెట్ దక్కించుకుంది. మరోవైపు వర్గల్ కు చెందిన సరస్వతి మాత మందిరానికి కూడా ఈ గుర్తింపు లభించింది.

Food safety national recognition for Yadadri and Vargal temples
Food safety national recognition for Yadadri and Vargal temples

దేశంలో 70కి పైగా దేవాలయాలు ఈ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా తెలంగాణలోని యాదాద్రి, సిద్దిపేట జిల్లా వర్గల్‌ దేవాలయాలకు ఈ గుర్తింపు దక్కింది.కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆడిట్‌ బృందం కొద్ది రోజుల క్రితం యాదాద్రి, వర్గల్‌ దేవాలయాలను సందర్శించి నైవేద్యం, అన్నప్రసాదాల నాణ్యత, వంటగది నిర్వహణ, ఆహారం తయారు చేసే విధానం, ఈ క్రమంలో పాటిస్తున్న శుచి, శుభ్రత అంశాలపై పరిశీలించింది. ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న కేంద్ర బృందం భోగ్‌ గుర్తింపునకు రిఫర్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news