BREAKING : రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం కేసీఆర్ !

-

రేపు ఎల్బీ స్టేడియంలో సీఎం గా రేవంత్ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం జరుగనుంది. ఆ కార్యక్రమానికి హాజరుకావాలని ఏఐసీసీ నేతలకు, ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం పంపారు. మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, ఏఐసీసీ నేతలకు ఆహ్వానం పంపారు. కర్ణాటక సీఎం సిద్దిరామయ్య, డిప్యూటీ సీఎం డీకేశివకుమార్, కర్ణాటక రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం పంపారు.

Revanth Reddy, CM KCR’s heavy defeat in Kamareddy

రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛతీస్ ఘడ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్…గతంలో ఇంచార్జిలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మోహిలి, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్, మరికొందరు ముఖ్యులు ఈ కార్యక్రమానికి రానున్నారు. తెలంగాణ ఏర్పాటు కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్, మరికొందరు నేతలకు ఆహ్వానం పంపారు.

తెలంగాణ అమరుల కుటుంబాలకు ఆహ్వానం పంపారు. కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్య తోపాటు మరికొందరు ఉద్యమ కారులకు ఆహ్వానం అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు. మాజీ సీఎం కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపనున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం జగన్ తోపాటు మాజీ సీఎం చంద్రబాబు,సినీ నటులకు ఆహ్వానం పంపనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version