హైడ్రాకు జగ్గారెడ్డి వార్నింగ్‌ !

-

సీఎం రేవంత్‌ రెడ్డికి పరోక్షంగా కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు. హైడ్రా రింగ్ రోడ్డు దాటి రాదని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారని..కానీ సంగారెడ్డి దాకా వచ్చిందన్నారు. సంగారెడ్డిలో హైడ్రా కూల్చివేతలు అని ప్రచారం జరుగుతుందని కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహించారు. అధికారులు అత్యుత్సాహం చూపించకండి అంటూ నిప్పులు చెరిగారు.

jaggareddy

సంగారెడ్డి లో కూల్చివేతలు లేకుండా చూడాలని కమిషనర్ రంగనాథ్ కి జగ్గారెడ్డి సూచనలు చేయడం జరిగింది. నా నియోజక వర్గంలో కూల్చివేతలు ఉంటే.. ముందు నా దృష్టికి తీసుకురండని కోరారు. నియోజక వర్గంలో ప్రజలను భయాందోళనలకు గురి చేయకండని కోరారు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అటు దానం నాగేందర్‌ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. బాధితులకు ఇండ్లు ఇచ్చి.. కూల్చివేతలు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news