పంచాంగం ప్రకారం ఆశ్వయుజమాసం శుక్లపక్షం ప్రతిపద తిధి అక్టోబర్ మూడవ తేదీన 12:18 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి అక్టోబర్ 4వ తేదీ ఉదయం 2:58 వరకు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉదయం తిథి ఆధారంగా ఈ సంవత్సరం దేవీ నవరాత్రులని అక్టోబర్ మూడవ తేదీ అంటే గురువారం నుంచి ప్రారంభం అవుతుంది. హిందూమతంలో దేవి నవరాత్రుల్లో కలశ స్థాపనకు ప్రత్యేక స్థానం ఉంది. అందువలన ప్రతి ఒక్కరు నవరాత్రి మొదటి రోజున కలశాన్ని ప్రతిష్టించడం ద్వారా నవరాత్రి దుర్గాదేవిని పూజను మొదలుపెడతారు. దుర్గాదేవి కలశంలో నివసిస్తుందని తొమ్మిది రోజులు పూజించబడుతుందని నమ్ముతారు.
కలశ స్థాపన లేకుండా పూజ సంపూర్ణంగా పరిగణించబడుతూ లేదంటే పూజ పూర్తి ఫలితం దక్కదు అని నమ్ముతారు. కనుక నవరాత్రుల మొదటి రోజున కలశాన్ని ఉదయం శుభ సమయంలో ప్రతిష్టిస్తారు. కలశ స్థాపనకి అక్టోబర్ మూడవ తేదీన 12:18 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 2:58 వరకు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉదయం తిధి ఆధారంగా ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు అక్టోబర్ మూడవ తేదీ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రులు మొదటి రోజున కలిశా స్థాపనకు రెండు శుభముహూర్తాలు ఉన్నాయి. కలశాన్ని ఏర్పాటు చేయడానికి ఉదయం 6:15 నుంచి 7 22 వరకు ఉంటుంది.
కలశ స్థాపన ఏర్పాటుకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది లేదంటే మధ్యాహ్నం 11:46 నుంచి 12:3 వరకు ఏ సమయంలోనైనా పెట్టొచ్చు. తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండాలి కలశ స్థాపన సమయంలో రాగి పాత్రను ఎంచుకొని బియ్యం, గోధుమలు, బార్లీ. సెనగలు, నాణేలు, గంగాజలం, పసుపు, కుంకుమ, అక్షితలు వేసి మామిడి ఆకులు పెట్టి కొబ్బరికాయని పెట్టాలి. మనసు నిర్మలంగా ఉండాలి. కలశ స్థాపన సమయంలో మనసులో ఎలాంటి ప్రతికూల భావాలు ఉండకూడదు.