మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు నోటీసులు జారీ అయ్యాయి. దింతో మరోసారి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం ఈ రోజు కమిషన్ ముందు హాజరుకానున్నారు హరీష్ రావు.

గతంలో కమిషన్ ముందు హరీష్ రావు హాజరు అయ్యారు. తుమ్ముడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణ కమిషన్ కు వివరించామని పేర్కొన్నారు. వ్యాప్‌కోస్ సూచన మేరకు, CWC నివేదిక మేరకు, మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం కారణంగా ఆనాడు బ్యారేజ్ ప్రాంతాన్ని మార్చమని కమిషన్‌కు తెలియజేశానన్నారు. నీళ్ళు లేని చోట కాంగ్రెస్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తే, నీళ్ళున్న చోటకి మా ప్రభుత్వంలో మార్చామని ప్రకటించారు.
మరోసారి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం ఈ రోజు కమిషన్ ముందు హాజరుకానున్న హరీష్ రావు https://t.co/2cF18gDYAn pic.twitter.com/2JnCfP1nNc
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025