స్కూల్ బస్సును ఢీకొన్న రైలు… ముగ్గురు విద్యార్థులు మృతి

-

స్కూల్ బస్సును ఓ రైలు ఢీ కొట్టింది. ఈ పెను ప్రమాదంలో ఏకంగా ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించడమే కాకుండా పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా చమ్మం గుప్పం లోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు.. కాపలా లేని ఓ రైల్వే గేట్ దాటుతోంది.

TRAIN
TRAIN

ఈ నేపథ్యంలోనే రైలు వేగంగా వచ్చి బస్సును ఢీ కొట్టింది. దీంతో… బస్సు తుక్కుతుక్కుంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు విద్యార్థులు మరణించగా పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు తక్కువగా బస్సులో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ సంఘటన జరగగానే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news