BREAKING : బీజేపీకి మాజీ మంత్రి చంద్రశేఖర్‌ రాజీనామా

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి షాక్‌ తగిలింది. తాజగా బీజేపీ పార్టీలో మరో వికెట్ డౌన్ అయింది. నిన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు BJP సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి A చంద్రశేఖర్.

కేంద్ర ప్రభుత్వం… తెలంగాణ ప్రభుత్వ అన్యాయాలను నిలువరించలేకపోతుంది అంటూ లేఖలో పేర్కొన్నారు చంద్రశేఖర్. అంతేకాదు..బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు ఏ. చంద్రశేఖర్. 18 న ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పార్టీలో ఏ. చంద్రశేఖర్ చేరనున్నారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు.. చేసిన ఏ. చంద్రశేఖర్ కాంగ్రెస్‌ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news