బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఇవాళ ఏసీబీ విచారించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో నిన్న హైకోర్టులో లాయర్ సమక్షంలో విచారించాలని పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. లాయర్ విచారించే సమయంలో ఏసీబీ ఆఫీస్ వద్దకు వెళ్లవచ్చని.. కానీ కేటీఆర్ ని ఒంటరిగానే విచారిస్తారని వెల్లడించింది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో విచారణ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
ఇవాళ కేటీఆర్ ను విచారించనున్న నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును గృహ నిర్బంధం చేశారు.హరీశ్ రావు నివాసం వద్ద పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అవుతారా..? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం.