మరి రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటి? – మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

-

మరి రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి….మార్గదర్శకాలు కావవి.. మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు అంటూ మండిపడ్డారు. రుణమాఫీ మార్గదర్శకాలు అభ్యంతరకరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది.. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, రైతాంగం బాగుండాలని, తద్వారా విరివిగా ఉపాధి అవకాశాలు లభించాలని కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత కరెంటు, సాగునీళ్లు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు.


ఉమ్మడి రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ రంగాల కష్ట, నష్టాల మూలంగా అనేకమంది రైతులు ప్రాణాలను కోల్పోయారు…తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ రైతులు, వ్యవసాయమే ఇరుసుగా పనిచేశాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పడిన రైతుల రుణభారాన్ని తొలగించడం మూలంగానే రైతు కుదుటపడతాడు, వ్యవసాయం సుస్థిరం అవుతుందని భావించి కేసీఆర్ రెండు విడతలుగా రుణమాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు… మొదటి విడతలో 35.31 లక్షల మంది రైతులకు రూ. 16,144 కోట్లు రుణమాఫీ చేశారని వివరించారు. రెండో విడతలో 22.98 లక్షల రైతులకు చెందిన రూ.13,000 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చే వరకు కేసీఆర్ ప్రభుత్వంలో మిగిలిపోయింది రూ. 6440 కోట్లు మాత్రమే… మొత్తం రెండు విడతలలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 29,144 కోట్లు రుణమాఫీ చేసిందని తెలిపారు.

ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం అసలు రైతులకు రుణాలే మాఫీ చేయనట్లు కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసింది… తాము అధికారంలోకి వస్తే ఇలా ఎన్నికలు అయిపోగానే అలా డిసెంబరు 9న రుణమాఫీ చేస్తాం అని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో ఉన్న 69 లక్షల పైచిలుకు ఉన్న తెలంగాణ రైతాంగంలో ఆశలు రేపిందని వెల్లడించారు. అందరి రుణాలను మాఫీ చేస్తామని ఆ రోజు బహిరంగంగా చెప్పారు.. ఈరోజు కొందరికే పరిమితం చేసేందుకు మార్గదర్శకాలు తీసుకువచ్చారు…. ఈ రోజుల్లో 5 ఎకరాల వ్యవసాయదారుడు, 30 వేల జీతం చేసే ఉద్యోగి కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తున్నాడు.. రేషన్ కార్డు, పీఎం కిసాన్ డాటా వంటివి పెట్టి కొందరినే రుణమాఫీకి పరిమితం చేస్తున్నారని ఆగ్రహించారు. రుణమాఫీ చేశాం అన్న ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వ ప్రయత్నాలు తప్ప.. రైతాంగం బాగుండాలి .. వ్యవసాయం బాగుండాలి అన్న సంకల్సం ఈ ప్రభుత్వానికి లేదని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version