హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. సంచలన విషయాలు వెల్లడించిన డీసీపీ

-

హైదరాబాద్  నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఐదుగురిని అరెస్ట్ చేశారు రాజేంద్ర నగర్ పోలీసులు. మరోవైపు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అనుప్ సింగ్ ప్రీత్ సింగ్ ని కూడా అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు.

అరెస్టయిన వారిలో ఇద్దరు నైజీరియన్లు కూడా ఉన్నట్లు తెలిపారు. రూ.35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్తోపాటు, రెండు పాస్పోర్టులు, 10 ఫోన్లు, 2 బైకులను సీజ్ చేశామన్నారు. నిందితులను ఒనౌహా బ్లెస్సింగ్, అజీజ్ నోహ్యీ, వెంక గౌతమ్, వరుణ్ కుమార్, మహ్మద్ షరీఫ్లుగా గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరి గురించి సమాచారం ఇస్తే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని డీసీపీ ప్రకటించారు. అనౌహా బ్లెస్సింగ్ ఇక్కడికి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తుంది. ఇప్పటి వరకు ఆమె 20సార్లు నైజీరియా నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించాం. ఆమె దగ్గర 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించాం. వారిలో ఆరుగురికి కొకైన్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. వీరిపైనా కేసులు నమోదు చేశామని  డీసీపీ వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version