దమ్ముంటే..బీఆర్‌ఎస్‌ ఆఫీస్ పై చెయ్యి వెయ్యి – కంచర్ల భూపాల్ రెడ్డి సవాల్

-

దమ్ముంటే..బీఆర్‌ఎస్‌ ఆఫీస్ పై చెయ్యి వెయ్యి అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీని కూల్చాలని అధికారులను వేధించడం కాదు, దమ్ముంటే నువ్వే వచ్చి పార్టీ ఆఫీస్ పై చెయ్యి వెయ్యి అంటూ సవాల్‌ విసిరారు కంచర్ల భూపాల్‌ రెడ్డి.
పాలన చేత కాక కోడిగుడ్డు మీద ఈకలు లెక్కపెడుతున్న కోమటిరెడ్డి నీ వైఖరి మార్చుకో అంటూ చురకలు అంటించారు.

Former MLA Kancharla Bhupal Reddy is challenging Minister Komati Reddy Venkat Reddy

బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధి పనుల వద్ద ఫోటోలతో ఫోజులిస్తున్నారు తప్పా.. కొత్తగా చేస్తున్న అభివృద్ది ఏమి లేదని ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప… అభివృద్దేమో గడప దాటడం లేదన్నారు. మా పార్టీ కార్యాలయాన్ని కూల్చడమే పనిగా పెట్టుకున్నట్టున్నాడని ఆగ్రహించారు. నిబంధనలు, అనుమతుల ప్రకారమే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం జరిగిందని…. నిబంధనలు మాట్లాడితే హైద్రాబాద్లో గాంధీభవన్ తో సహా.. తెలంగాణలో అన్ని పార్టీల కార్యాలయాలు కూల్చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version