ఆందోల్ నియోజక వర్గంలో దళితబంధు లొల్లి తెరపైకి వచ్చింది. ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, తమ్ముడు రాహుల్ కిరణ్ దళితబంధు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, తమ్ముడు రాహుల్ కిరణ్ పై టేక్మాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు పల్వంచ గ్రామానికి చెందిన భూమయ్య.
పల్వంచ గ్రామంలో నలుగురు దళితుల నుంచి 3 లక్షల చొప్పున 12 లక్షలు మాజీ ఎమ్మెల్యే క్రాంతి, తమ్ముడు రాహుల్ కి ఇచ్చామని చెబుతున్నాడు భూమయ్య. దళితబంధు రాకపోవడంతో డబ్బులు అడిగితే సృజన్ అనే వ్యక్తి చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే..తనపై వస్తున్న ఆరోపణలపై ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.
భూమయ్య చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం కాదని.. కేవలం రాజకీయ కక్షతో ఇలా నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. నేను తప్పు చేస్తే లై డిటెక్టర్ పరీక్షకు కూడా రెడీ అని.. కావాలనే మంత్రి దామోదర రాజనర్సింహ ఇలా కుట్రలు చేస్తున్నాడని నిప్పులు చెరిగారు ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.