మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందే : హైకోర్టు

-

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహెల్ పోలీసుల విచారణ కు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 16న పంజాగుట్ట పోలీసుల ముందు షకీల్ కొడుకు సాహెల్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. షకీల్ కొడుకు సాహెల్ పై ప్రజా భవన్ గేట్స్ ను రాష్ డ్రైవింగ్ తో ఢీ కొట్టాడని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కేసు నమోదు అయిన తరువాత సాహెల్ దుబాయ్ పారిపోయాడు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న సాహెల్ హైదరాబాద్ రావాల్సిందేనని పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది.

ప్రజాభవన్ గేట్లను ఢీ కొన్న కారు కేసులో సాహెల్ ను తప్పించి డ్రైవర్ ఆఫీస్ ను నిందితుడిగా చేర్చేందుకు పంజాగుట్ట సీఐ దుర్గారావు చేసిన ప్రయత్నం బయటపడగా.. ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేయడంతో పాటు కేసు కూడా నమోదు చేశారు. ఇందులో బోధన్ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ను అబ్దుల్లా వాహేద్ ను కూడా నిందితులుగా చేర్చగా నిందితుల సంఖ్యగా ఎనిమిదికి చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version