తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. జోసెఫ్ గోబెల్స్ ను ఆదర్శంగా తీసుకొని సీఎం ేవంత్ రెడ్డి, మంత్రులు పని చేస్తున్నారని విమర్శించారు. ఏడాది కాలంలో బీఆర్ఎస్ పలు ఆటుపోట్లు ఎదుర్కొందని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి, కేసీఆర్ అనారోగ్యం, కవిత జైలుకు వెళ్లడం, పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. బీఆర్ఎస్ తట్టుకొని నిలబడిందని కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో అప్పులు జరిగాయంటూ సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. సీఎం తప్పులపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన సోదరులకే లాభం జరిగిందన్నారు. రాష్ట్రంలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టే స్థాయికి ఆయన కుటుంబం ఎదిగిందని చెప్పుకొచ్చారు. 2023లో రెవెన్యూ మిగులు రూ.5944 కోట్లుగా ఉందని చెప్పారు. కేసీఆర్ కి 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే అది చూపించాలని.. ఒకవేళ ఉంటే అది సీఎం రేవంత్ రెడ్డికే రాసిస్తానని కీలక ప్రకటన చేశారు కేటీఆర్.