గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని గాలికొదిలేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తాజాగా పెద్దపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లిలో రూ.1500 కోట్లు అభివృద్ధి చేశామని తెలిపారు. ఏడాదిలో 56వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మరికొన్ని నియామకాలు కొనసాగుతున్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లతో యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతున్నామన్నారు.
ప్రతీ మంత్రి రెోజుకు 18 గంటలు పని చేస్తున్నారు. బీఆర్ఎస్ మాదిరిగా ప్రచారం చేసి ఉండి ఉంటే.. పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పనులు కనిపించేవి. పని చేయడమే ప్రాముఖ్యతను ముందుకు వెళ్తున్నాం. తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఒక్కసారి ఆలోచన చేయండి.. ఒక్క సంవత్సర కాలంలో ఒక్క నెల రోజుల్లోనే 21వేల కోట్లను రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే. దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. 64వేల కోట్లు అప్పులకు వడ్డీలు కట్టామని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ.500 గ్యాస్, రూ.500 బోనస్, యువతి, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.