మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ కి రాజీనామా ?

-

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నకిరెకల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు వేముల వీరేశం. ఆయనపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ లో చేరాడు. దీంతో నకిరేకల్ లో వీరేశం హవా కాస్త తగ్గింది. అయినప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ తనకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే భావించాడు. కేసీఆర్ సిట్టింగ్ లకే కేటాయించడంతో వీరేశం ఆశలు గల్లంతయ్యాయి. దీంతో అధిష్టానం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇవాళ సన్నిహితులు అనుచరులతో వీరేశం సమావేశమయ్యారు. 

బీఆర్ఎస్ లో కొనసాగి లాభం లేదని.. కాంగ్రెస్ లో చేరాలని వేముల వీరేశం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అభిప్రాయాన్ని అనుచరులు కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కి రాజీనామా చేసిన వీరేశం కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో వీరేశానికి అనుకూలంగా ఫలితాలు వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. వీరేశానికి కాంగ్రెస్ లో చేరికకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశముందంటూ.. చర్చ కొనసాగుతుంది. గతంలోనే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తి చూపించగా.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకించినట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు వేముల వీరేశం చేరికపై కోమటిరెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరీ.  

Read more RELATED
Recommended to you

Latest news