తెలంగాణకు ప్రత్యేక హోదా ఉందని నీతి ఆయోగ్ చెబుతోందని అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగితే తెలంగాణకు ప్రత్యేక హోదా ఉన్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించిందని వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వాలు చెక్ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ఐదు మండలాలు తిరిగి వెనక్కి ఇచ్చేయమని తెలంగాణ కోరుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వైయస్ జగన్ ఎలా అఫిడవిట్ ఫైల్ చేయారో మీరు కూడా అదే చేయమని చంద్రబాబును కోరుతున్నానని చెప్పారు.
స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రకటించిన 11 రాష్ట్రాల్లో తెలంగాణ ను ఎందుకు చేర్చారో తెలియటం లేదన్నారు. మహారాష్ట్రకు చెందిన ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 12.5% తేడా ఉందని ప్రకటించారు… దీనిపై ఎందుకు ఎవరు స్పందించడం లేదని వెల్లడించారు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయిన ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు ఓట్ల వివరాలు భద్రంగా ఉంచాలని కోరారు. ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పిన వివరాలు తప్పయితే తప్పని చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఓట్ల వివరాలు పది రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో … స్పష్టం తెలియాలన్నారు.