WORLD CUP 2023:”కేన్” మామ టీం లోకి వచ్చాడోచ్… బ్యాటింగ్ చేయనున్న బంగ్లాదేశ్ !

-

ఈ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ఆడనున్న మూడవ మ్యాచ్ చెన్నై లో మరికొద్ది సమయంలో స్టార్ట్ కానుంది. వరుసగా రెండు మ్యాచ్ లలోనూ కివీస్ విజయం సాధించి టైటిల్ ను గెలుచుకునే దిశగా కసికసిగా అడుగులు వేస్తోంది. కానీ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గత రెండు మ్యాచ్ లలోనూ ఫిట్ నెస్ సమస్యలతో బరిలోకి దిగలేదు. స్టాండ్ ఇన్ కెప్టెన్ లాతమ్ చక్కగా టీం ను విజయం వైపు నడిపించి సక్సెస్ అయ్యాడు. కాగా ఈ రోజు బంగ్లాదేశ్ తో జరగనున్న మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ ఏ విధంగా జట్టును నడిపించనున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. ముందుగా టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ కె మొగ్గు చూపాడు, పిచ్ బ్యాటింగ్ కు సహకరించడం, స్పిన్నర్లు కీలకం కానున్న నేపథ్యంలో ఛేజింగ్ చేయడానికి విలియమ్సన్ ఓటేశాడు. కాగా బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

టీం లో మహేది హాసన్ బదులుగా సీనియర్ ప్లేయర్ మహ్మదుల్లా జట్టులోకి రాగా… కివీస్ యంగ్ ను పక్కన పెట్టి విలియమ్సన్ ను తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news