ఫార్ములా – ఈ పై చర్చించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు – కేటీఆర్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఫార్ములా – ఈ కార్ రేసింగ్ లో ఏ-1 గా చేర్చారు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ని ఏ-2 గా ఏసీబీ పేర్కొంది. కేటీఆర్ పై నాన్ బేలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులపై గురువారం రాత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ఫార్ములా – ఈ రేస్ పై చర్చించే దమ్ము లేదని మండిపడ్డారు.

దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని స్పీకర్ గారిని కోరాను. ఈ అంశంపై చర్చ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశాను. ఇందులో జరిగిందేంటో తెలంగాణ ప్రజలకు తెలియాలి. కానీ ప్రభుత్వానికి దీనిపై చర్చించే దమ్ము లేదు. దమ్ముంటే చర్చ పెట్టమంటే స్పందించడం లేదు. తప్పు జరిగిందని ధైర్యంగా నిరూపించగలరా..? అని ప్రశ్నించారు కేటీఆర్.

కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడే ధైర్యం మీకు లేదా అన్నారు. ఈ అంశం లో ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది. ఫార్ములా ఈ రేస్ కుంభకోణంపై ఏదో జరిగిందని గగ్గోలు పెడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ రేస్ తేవాలని ప్రయత్నాలు జరిగాయి. ఇందులో ఏదో కనిపెట్టామని లీకులు చేస్తున్నారు. కానీ ఇందులో జరిగిందేమీ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news