హైడ్రా కూల్చివేతలు బాధితుల‌కు న‌ష్ట‌ప‌రిహారం..?

-

హైడ్రా ప‌నితీరుపై ముఖ్య‌మంత్రికి ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చింది. అయితే హైదరాబాద్ లో హైడ్రా వరుస కూల్చివేతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్ర‌మ క‌ట్ట‌డాల బిల్డ‌ర్స్ యొక్క ఆస్థులు జ‌ప్తు చేసి.. ఈ కూల్చివేతలో నష్టపోయిన బాధితుల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలి అని తెలిపింది. అలాగే పేద‌వారి ఇళ్ళు కూల్చిన‌ప్పుడు వారికి ప్ర‌భుత్వం భూమి ఇవ్వాలి లేదా ఇందిర‌మ్మ ఇళ్ళు ఇవ్వాలి అని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ పేర్కొంది.

అదే విధంగా బిల్డ‌ర్ల‌తో కుమ్మ‌క్కై ఇష్టారీతిన రిజిస్ట్రేష‌న్లు, లే అవుట్ ప‌ర్మిష‌న్‌ లు ఇచ్చిన అధికారులపై చ‌ర్య‌లు తీసుకోవాలి అని తెలిపింది. ఇంకా చెరువుల స్తలాలలో నుంచి కూల్చిన క‌ట్ట‌డాల వ్య‌ర్థాల‌ను తీసి, చుట్టూ కంచె వేసి, చుట్టు ప‌క్క‌ల కాల‌నీ వాసుల‌కు చెరువును కాపాడుకోవాల్సిన బాధ్యత అప్ప‌గించాలి అంది. అలాగే హైడ్రా వంటి సంస్థ‌లు త‌మ త‌మ జిల్లాల‌లో కావాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. కాబట్టి తెలంగాణ అంత‌టికి వ‌ర్తించేలా ఒక చ‌ట్టం చేసి ప్ర‌తి జిల్లాలో ప్ర‌భుత్వ భూములు కాపాడ‌టానికి ఈ సంస్థ ఏర్పాటు చేయాలి అని అని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news