సికింద్రాబాద్‌లో సినీ ఫక్కీలో దోపిడీ.. నలుగురి అరెస్టు

-

సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌ జ్యూవెలరీ షాపులో ఐదుగురు వ్యక్తులు ఐటీ అధికారులమంటూ వచ్చి 1.7 కిలీలో బంగారు బిస్కెట్లు దోచుకెళ్లారు. శనివారం రోజున జరిగిన ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి మరీ దర్యాప్తు సాగించారు. ఈ ఘటనలో తాజాగా నలుగురు అరెస్టయ్యారు. ఐటీ అధికారుల ముసుగులో చోరీకి పాల్పడిన నిందితులు జాకీర్‌, రహీమ్‌, ప్రవీణ్‌, అక్షయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన అనంతరం నిందితులంతా మహారాష్ట్రకు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడకు వెళ్లి వారిని పట్టుకున్నారు. మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలిపారు. దోపిడీకి పాల్పడిన ముఠాలో మొత్తం 8 మంది ఉన్నట్లు సమాచారం.

గత శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో పాట్‌ మార్కెట్‌లోని బాలాజీ గోల్డ్‌ షాప్‌లో ఐదుగురు అగంతుకులు ఐటీ అధికారులమంటూ చొరబడి 1700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పారిపోయిన ఘటన సంచలనం రేకెత్తిన విషయం తెలిసిందే. ఇంటిదొంగల సహకారంతోనే బంగారం దోచుకెళ్లి ఉండొచ్చనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దుకాణ యజమానులు, సిబ్బంది ఫోన్‌ కాల్‌ డేటాను విశ్లేషిస్తున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version