జంపన్నవాగులో 7 గురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం

-

వరంగల్‌ జిల్లాలో వర్షాలు బీభత్సంగా కురిశాయి. ఇక హైదరాబాదులో నిన్న సాయంత్రం నుంచి తగ్గిన వర్షం మళ్ళీ మొదలైంది. కోటి, నాంపల్లి, లకిడికపూల్, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, కైరాతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్, కొండాపూర్, ఏఎస్ రావునగర్ సహా పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడుతుంది.

హైదరాబాద్ వ్యాప్తంగా ఆకాశం మేఘావృత్తమై ఉంది. ఇవాళ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే.. జంపన్నవాగులో ఏడుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వర్షపాతం ములుగు జిల్లా వెంకటపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో 64.9 సెంటీమీటర్లు నమోదు అయింది. గతంలో 2013 జూలై 19న ములుగు జిల్లా వాజేడులో పడిన 51.75 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version