వామ్మో అప్పట్లోనే నమిత ఇంతమందితో ఎఫైర్ నడిపిందా..?

-

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ప్రేమ , పెళ్లి, ఎఫైర్ రిలేషన్ వంటి వాటికి ఎక్కువగా విలువ ఉండదు. ఇదంతా సర్వసాధారణంగా మారిపోయింది. బంధాలు తెగిపోతే కొన్ని రోజులు బాధపడతారు. ఆ తర్వాత మళ్లీ తమ సినీ కెరియర్లో బిజీ అయిపోతుంటారు సినీ సెలబ్రిటీలు. ముఖ్యంగా సినిమా అవకాశాలు వస్తే చాలు ఏ పని చేయడానికి అయినా సిద్ధపడే నటులు కూడా కొంతమంది ఉన్నారనే చెప్పాలి. ముఖ్యంగా సినిమాల్లో నటిస్తున్న క్రమంలో చాలామందితో గాసిప్స్ కూడా వస్తూ ఉంటాయి.

అందులో ఎంత నిజం ఉంది అనేది కూడా ఒక అనుమానం అనే చెప్పాలి. అలాంటి క్రమంలో హీరోయిన్ నమిత పై కూడా సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల పుకార్లు వచ్చాయి. సొంతం సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కెరియర్ ప్రారంభించిన ఈమె అదే సమయంలో ఆర్యన్ రాజేష్ తో ఎక్కువగా క్లోజ్ గా ఉండడం చూసి డైరెక్టర్ శ్రీనువైట్ల ఆమెను మందలించాడని వార్తలు వచ్చాయి. అయితే అప్పటినుంచి ఆమె శ్రీను వైట్ల సినిమాల్లో మళ్లీ అవకాశాన్ని దక్కించుకోలేదు.

ఇక ఆ తర్వాత సొంతం సినిమా చేస్తున్న సమయంలోనే జెమినీ సినిమాలో అవకాశం రావడంతో అటు షిఫ్ట్ అయిపోయింది. తెలుగులో ఒక అరడజన్ సినిమాలో నటించిన ఈమె ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో ఎక్కువగా సత్యరాజ్, శరత్ కుమార్ సినిమాలలో నటించింది. ఈ ఇద్దరితో చాలా క్లోజ్ గా ఉండేదట. ముఖ్యంగా శరత్ కుమార్ విషయంలో అయితే ఏకంగా హద్దులు దాటి మరి ప్రవర్తించిందట. దాంతో రాధికా రంగ ప్రవేశం చేసి నమితకు గట్టి వార్నింగ్ ఇచ్చిందని సమాచారం. అంతేకాదు కొద్ది రోజుల తర్వాత బిల్లా సినిమా షూటింగ్ సమయంలో కూడా నమిత , ప్రభాస్ ఏడాది పాటు డేటింగ్ చేశారని వార్తలు వినిపించగా.. వాటిని కొట్టి పారేశారు. ఇలా మరికొంతమందితో ఆమె డేటింగ్ చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ అందులో ఒకటి కూడా నిజం కాలేకపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version